- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న ఏపీ నాయకుడు ఎవరో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజకీయాల్లో కీలక నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. శ్రీకాకుళం రాజకీయాల్లో సీనియర్ నాయకులైన ధర్మాన కుటుంబం తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండి, తర్వాత వైసీపీలో కొనసాగుతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర ఉన్న ధర్మాన రెండుసార్లు నరసన్నపేట నుండి, మూడుసార్లు శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఎంఎల్ఏగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి, తనకంటే రాజకీయాల్లో చిన్నవాడైన గోండు శంకర్ చేతిలో ఓడిపోవడాన్ని ధర్మాన జీర్ణించుకోలేక పోతున్నాడని సన్నిహితుల సమాచారం. అంతే కాకుండా రాజకీయాల్లో నుండి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. కాగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఇటీవలి ఎన్నికల్లో తన కుమారుడికే శ్రీకాకుళం నియోజకవర్గం నుండి టికెట్ కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ.. అధిష్టానం మాత్రం ధర్మానకే ఇచ్చింది. ఇక తను రాజకీయాలనుండి తప్పుకొని తన వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి అప్పగించాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. 2028 ఎన్నికల కోసం తన కుమారున్ని సిద్దం చేసే పనిలో భాగంగా కొన్ని బాధ్యతలు అప్పగిస్తే కొంత అనుభవం సంపాదించే అవకాశం ఉంటుందని ధర్మాన భావిస్తున్నారని సన్నిహితులు అనుకుంటున్నారు. అయితే నిజంగానే ధర్మాన రాజకీయాలకు గుడ్ బై చెప్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.