ఏపీ భూముల మార్కెట్ విలువ పెంపు నిర్ణయం..ధరలు ఎలాగంటే ?

by Seetharam |
ఏపీ భూముల మార్కెట్ విలువ పెంపు నిర్ణయం..ధరలు ఎలాగంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్: భూముల మార్కెట్ విలువ పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విశాఖ లాంటి నగరాల్లో భూముల రేట్లు అమాంతం పెరగనున్నాయి. స్పెషల్ రివిజన్ పేరుతో విలువ పెంపు చేయనున్నారు. పెరిగిన చార్జీలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్లు మొరాయిస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. భూముల మార్కెట్ విలువ పెంచాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రద్దీ పెరుగుతోంది. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో భూములకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. కొత్త జిల్లా కేంద్రాల్లో భూముల రేట్లపై ప్రభావం పడనుంది.

ధరలు పెరిగే ప్రాంతాలు:విశాఖ, గాజువాక, ద్వారకానగర్, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, మధురవాడ.

భూమి విలువ పెంపు ఇాలా:డిమాండ్ ఉన్న చోట 60 శాతం, మధ్యస్థంగా ఉన్నచోట 40 శాతం, తక్కువ ఉన్న చోట 30 శాతం మేర భూముల రేట్లు పెంచనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed