- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP: బాధితుల పరిహారంపై జగన్ మాట్లాడటం హస్యాస్పదం.. హోంమంత్రి అనిత కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ప్రమాద ఘటనలో పరిహారంపై మాజీ సీఎం జగన్ మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లగా అబ్ధాలు చెప్పడం జగన్‌కు బాగా అలవాటైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాద ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందగా.. అందులో ముగ్గురికి నేటికి రూ.కోటి అందలేదని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఎసెన్షియ ప్రమాద ఘటనలో మృతిచెందిన 17 మంది మృతులకు, 36 మందికి క్షతగాత్రులకు ఆర్‌టీజీఎస్ సాయంతో వెంటనే వారి అకౌంట్లలో డబ్బు జమ చేశామని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ ప్రమాదాలను అడ్డు పెట్టుకుని శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వయంగా బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించి ఎప్పటికప్పుడు వారి బాగోగులను తెలుసుకుంటున్నారని అనిత కౌంటర్ ఇచ్చారు.