- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ ప్రగతిలో ఏపీ కీలకం కాబోతుంది : సీఎం జగన్
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణం పరిపాలన రాజధాని కాబోతుందని వెల్లడించారు. వీలైనంత త్వరలో విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయని.. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలతో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా నిలుస్తోందని చెప్పుకొచ్చారు.
ఈ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 తొలిరోజే 92 ఎంవోయూలు నమోదు చేసుకోవడం సంతోషకరమని చెప్పుకొచ్చారు. ఈ 92 ఎంవోయూలతో మెుత్తం 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నట్లు చెప్పుకొచ్చారు. మెుత్తం 20 రంగాల్లో పెట్టుబడులుపెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారబోతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 340 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ 340 సంస్థలు ఎంవోయూ చేసుకుంటే రాష్ట్రంలో 6లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.