ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు: చంద్రబాబు

by srinivas |   ( Updated:2024-06-27 12:59:42.0  )
ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు: చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ కానూరులో రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొ్న్నారు. సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రామోజీరావు ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని కొనియాడారు. ఏ రంగం తీసుకున్నా అందులో రామోజీరావు నెంబర్ వన్‌గా ఉన్నారని తెలిపారు. నీతి, నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు అని పేర్కొన్నారు.

‘‘రామోజీరావు ప్రజాహితం కోసమే రాజీలేని పోరాటం చేశారు. వ్యాపారం, సినీ, సేవా, పత్రికా రంగంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కృషి చేశారు. చాలా అవార్డులను దక్కించుకున్నారు. చాలా యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చి ఆయనను గౌరవించాయి. పద్మవిభూషణ్ ఇచ్చి భారత ప్రభుత్వం సైతం రామోజీరావును గౌరవించింది. సమాజానికి చేసిన సేవ వల్లే ఆయనకు అన్ని అవార్డులు వచ్చాయి. ఆయన పెట్టిన మార్గదర్శిని దెబ్బతీసేందుకు చాలా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. మార్గదర్శిపై ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో పోగొట్టాలని యత్నించారు. అయినా వెనక్కి తగ్గలేదు. మార్గదర్శి డిపాజిటర్లు రామోజీరావుకు మద్దతుగా నిలిచారు.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘‘రైతులకు సేవ చేసేందుకు 1969లో అన్నదాత పేపర్ తీసుకొచ్చారు. 1974 ఆగస్టు 10లో ఈనాడు పేపర్ మొదటి ఎడిషన్ పెట్టారు. ఐదు దశాబ్దాలుగా ఈనాడు పేపర్‌ను అభివృద్ధి చేశారు. ప్రజా చైతన్యం కోసం నిరంతరం ఈనాడు పేపర్ పని చేస్తోంది. 24 ఎడిషన్లు తీసుకొచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. 40 ఏళ్లుగా ఈనాడు పేపర్ నెంబర్ 1గా ఉంది. సినిమా, వ్యాపారం, పత్రికారంగంలో ఎంతో మందికి రామోజీరావు అవకాశం కల్పించారు.’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed