ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'పుష్ప' నటుడు.. అమ్మాయిలు తట్టుకోవడం కష్టం అంటున్న నెటిజన్లు(పోస్ట్)

by Kavitha |   ( Updated:2024-11-02 03:33:38.0  )
ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పుష్ప నటుడు.. అమ్మాయిలు తట్టుకోవడం కష్టం అంటున్న నెటిజన్లు(పోస్ట్)
X

దిశ, సినిమా: సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’(Pushpa) మూవీలో జాలీ రెడ్డి(Jaly Reddy)గా నటించి తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు ధనంజయ్(Dhananjay) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కన్నడ ఇండస్ట్రీలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతనిని ఫ్యాన్స్ ముద్దుగా ‘డాలీ’ అని పిలుస్తారు. అయితే ఇతని యాక్టింగ్‌కు ఫిదా అయిన డైరెక్టర్ సుకుమార్ ఇతన్ని ‘పుష్ప’ సినిమాలో జాలి రెడ్డి రోల్‌కి కరెక్ట్‌గా సరిపోతాడని చాన్స్ ఇచ్చాడు. అలా ఈ మూవీతోనే ధనంజయ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వేల్‌గా వస్తున్న ‘పుష్ప2’(Pushpa 2) మూవీలో కూడా నటించి అదరగొట్టేయనున్నాడు.

ఇక ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనంజయ్.. తన బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా తన కాబోయే భార్య ధన్యత(Dhanyatha)ను పరిచయం చేశాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజిలో స్పెషలిస్ట్. అయితే వీళ్ళిద్దరికి చాలా క్రితం నుంచే పరిచయం. స్టార్టింగ్ ఫ్రెండ్స్‌గా ఉన్న వీరు.. తర్వాత కాలంలో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. అలా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు అమ్మాయిలు తట్టుకోవడం కష్టం అంటూ కామెంట్స్ చేస్తుంటే.. ఫ్యాన్స్, నటీనటులు మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మ్యారేజ్ జరగవచ్చని తెలుస్తోంది.

Advertisement

Next Story