- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రాంతాల వారీగా మొదలైన సామాజిక ఆర్థిక సర్వే..
దిశ, ఆలూరు: ఆలూరు మండల వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సోసియో ఎకనామిక్ సర్వేలో భాగంగా ఇంటింటికి స్టిక్కర్ల కార్యక్రమాన్ని శనివారం రోజున మొదలుపెట్టారు. మొదట గ్రామంలో,వార్డులో ఎన్ని కుటుంబాలు ఉన్నాయనే వివరాలను సేకరిస్తూ, ఇంటింటికి వెళ్లి సొసైయో ఎకానమిక్ సంబంధించిన స్టిక్కర్‌ను అంటిస్తారు. ఇంటిపై స్టిక్కర్ ఉందంటే సొసైయో ఎకానమిక్ ఫారమ్‌లో వివరాలు నమోదు చేయాలని అర్ధం.ఒక్కో ఎన్యుమరేటర్ 150-175 నుంచి ఇళ్లలో సర్వే వేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఒక ప్రశ్నావళి ఫామ్‌ను నింపేందుకు సగటున 20-40 నిమిషాలు పడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. సొసైయో ఎకానమిక్ సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు ఎప్పుడు వస్తారనే వివరాలను ముందుగానే ప్రజలకు తెలియజేయనున్నారు.
సోసియో ఎకనామిక్ నిర్వహించడం హర్షణీయం : ముక్కెర విజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం కులగణన /సోసియో ఎకనామిక్ సర్వే మొదలుపెట్టింది. ఈ సర్వే ప్రకారం బీసీల అభ్యున్నతికి తోడుపడుతుందని, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ నాయకుల తరపున ప్రత్యేక అభినందనలు.
పకడ్బందీగా సోసియో ఎకనామిక్ సర్వే : తాసిల్దార్ రమేష్, సెక్రటరీ రాజలింగం
ప్రభుత్వ ఆదేశానుసారల ప్రకారం సోసియో ఎకనామిక్ సర్వే పకడ్బందీగా నిర్వహిస్తామని, ఒక ఎమ్యులేటర్ 150-175 ఇల్లు కేటాయించమని తప్పులు లేకుండా సర్వే నిర్వహిస్తామని అన్నారు.