Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

by Jakkula Mamatha |
Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
X

దిశ,వెబ్‌డెస్క్: కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఆధ్యాత్మికంగా దివ్యమైనది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు చేస్తారు. మాసాలన్నిటిలో ఉత్తమైన మాసంగా కార్తీక మాసాన్ని చూస్తారు. ఈ మాసంలో శివ కేశవులను భక్తులు పూజిస్తారు. సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేస్తారు. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ఎంతో శుభకరమని భక్తులు నమ్ముతారు. ఇక ఈ మాసంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీక మాస శోభ సంతరించుకుంది. ఆలయాల్లో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక భక్తులు తెల్లవారుజామునే నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన మొదటి కార్తీక సోమవారం ఉంటుంది. కార్తీక సోమవారాల్లో శివారాధన చేస్తే మనఃశాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇదిలా ఉంటే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. శివనామస్మరణతో శ్రీ బాలా త్రిపుర సుందర సమేత సుందరేశ్వర స్వామి ఆలయం మార్మోగుతోంది. ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed