స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ కాబినేట్ సంచలన నిర్ణయం

by M.Rajitha |
స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ కాబినేట్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : బుధవారం జరిగిన ఏపీ కాబినేట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. ఇప్పటివరకూ ఇద్దరు పిల్లలు ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హులుగా ఉండగా, ఇకపై ముగ్గురు పిల్లలున్న వారు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనుమతినిస్తూ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముగ్గురు పిల్లలుంటే అనర్హులు అనే నిబంధనను తొలగించే బిల్లుకు కాబినేట్ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించే బిల్లును ప్రవేశ పెట్టనుంది. కాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ నిబంధనను తొలగిస్తామని ప్రత్యేక హామీ కూడా ఇచ్చింది కూటమి. ఈ మేరకు కాబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన పలు పథకాల్లోని అవకతవకలపై కూడా మంత్రివర్గం చర్చించినట్టు సమాచారం.

Next Story

Most Viewed