ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ

by Mahesh |
ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ, కొత్త మద్యం పాలసీ అమలు వేళ ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రాదాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో ప్రభుత్వం కొత్త పాలసీలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామిలలో.. ఒకటైన ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పన, పలు రంగాల్లో కొత్త పాలసీలపై చర్చించనున్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం, వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌‌‌లో రిజిస్ట్రేషన్‌ ఫీజుల మినహాయింపుపై చర్చించే అవకాశం ఉండగా.. దీపావళికి ప్రజలకు అందించలనుకుంటున్న 3 ఉచిత సిలిండర్‌ల పథకం పై చర్చించనున్నారు. అలాగే 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. కాగా ఈ కేబినెట్ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఇతర కూటమి మంత్రులు హాజరయ్యారు. కాగా రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed