- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు ఆ స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..! నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ నిత్యామీనన్(Nithya menon) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరోగా నటించిన ‘అలా మొదలైంది’(Ala Modalaindhi) మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. తన ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది. అలాగే తన అందం అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది.
ప్రస్తుతం ఈ అమ్మడు.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తోంది. అంతే కాదు ఈ బ్యూటీ సింగర్(Singer) గాను తన ప్రతిభ చాటుకుంది. సినిమాల్లో కొన్ని పాటలను కూడా ఆలపించింది ఈ అమ్మడు. ఇక నిత్యామీనన్ తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. కాగా తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’(Bheemla Nayak) సినిమాలో మెరిసింది. అయితే ధనుష్‌తో కలిసి ఆమె నటించిన ‘తిరు’(Thiru) సినిమాకు గాను ఉత్తమ నటిగా నిత్యా జాతీయ అవార్డు అందుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా నిత్యామీనన్ పెళ్ళికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. తమిళ్ స్టార్ హీరోను నిత్యామీనన్ పెళ్లి చేసుకోనుందని అంటున్నారు. గతంలోనూ ఈ భామ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి నిత్య మీనన్ పెళ్లి టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే నిత్యా పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వనున్నారని అంటున్నారు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.