రాష్ట్రంలో మరో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

by Jakkula Mamatha |
రాష్ట్రంలో మరో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల పై వరుస లైంగికదాడి(sexual assault) ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వస్తోంది. దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అభం శుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు. అయితే.. ఏపీలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. తాజాగా నంద్యాల జిల్లా(Nandyala District) బేతంచెర్ల మండలం కొలుములపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడి(sexual assault)కి పాల్పడ్డాడు. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో.. ఆ చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో ఈ ఘటనను స్థానికులు గమనించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed