బ్రేకింగ్.. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన

by Mahesh |   ( Updated:2024-03-11 06:58:48.0  )
బ్రేకింగ్.. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీలో రాజకీయ హోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అధికార వైసీసీని ఓడించేందుకు సిద్ధమైన జనసేన, టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకూడదనే భావం తో పొత్తు పెట్టుకుని జనసేన కేవలం 25 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో జనసేనాని పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికి పవన్ కల్యాణ్ ఆయన స్ట్రాటజీని ఫాలో అవుతూ.. ముందుకు సాగుతున్నారు.

పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు జనసేనకు వచ్చాయి. దీంతో మొదట ఐదుగురు అభ్యర్థలను జనసేనాని ప్రకటించారు. తాజాగా సోమవారం ఉదయం మరో స్థానంపై ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరడంతో.. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తన అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌ను ప్రకటిచింది. ఆయన ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story