Heavy Rains:భద్రాచలంలో భారీ వర్షాలు.. నీట మునిగిన అన్నదాన సత్రం

by Jakkula Mamatha |
Heavy Rains:భద్రాచలంలో భారీ వర్షాలు.. నీట మునిగిన అన్నదాన సత్రం
X

దిశ,ఏలూరు:గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ తదితర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన గోదావరి వరద నీరు క్రమేణా తెలంగాణ మీదుగా ఆంధ్రలోకి వస్తుండడంతో ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌లోకి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 34.20 అడుగులుగా నమోదైంది.

దిగువకు వస్తున్న గోదావరి వరదలకు తోడు తాలిపేరు, శబరి వరద నీరు కూడా కలుస్తుంటడంతో వరద పెరిగే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 30 మీటర్లు, దిగువన 21.900 మీటర్లు నీటిమట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని స్పిల్ వే 48 గేట్లను తెరిచి 6 లక్షల 23 వేల 962 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలకు కారణంగా భద్రాచలం లో కురుస్తున్న భారీ వర్షాలకు రామాలయం విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రాలు వర్షపు వరద నీరు చుట్టుముట్టింది.

Advertisement

Next Story

Most Viewed