- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు మార్క్ పాలన షురూ.. వాటిపై జగన్ ఫొటో ఉన్నా నో ప్రాబ్లమ్ అంటూ ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలోని సీఎం ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా మొత్తం ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తారు. ఇదిలా ఉండగా.. బాధ్యతల స్వీకరణకు ముందే చంద్రబాబు తన మార్క్ పాలన మొదలెట్టారు. కొన్ని పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. తిరుమల పర్యటన వేదికగా ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. గతంలో విద్యా కనుక పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బడికి వెళ్లే పిల్లలకు ఒక కిట్‌ను అందజేసిన సంగతి తెలిసిందే.
అందులో స్కూల్ బ్యాగు, నోట్ పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, సాక్సులు, బెల్డ్, టై అన్నింటినీ కలిపి విద్యార్థులకు అందజేసేవారు. అయితే అలా పంపిణీ చేసే కిట్‌పై జగన్ బొమ్మను ముద్రించి ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో జగన్ బొమ్మలను తొలగించి పంపిణీ చేస్తారని అంతా భావించారు. అనూహ్యంగా రాష్ట్రం ముందు కక్ష సాధింపులు తర్వాత అని చెప్పిన చంద్రబాబు.. అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. జగన్ ఫొటోలు ఉన్నా పంపిణీ చేయాలని ఆదేశించారు. అనవసరంగా నిధులు దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది.