- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'న్యాయానికి సంకెళ్లు' కార్యక్రమానికి అద్బుత స్పందన.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు టీడీపీ మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. న్యాయానికి సంకెళ్లు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చేతులకు సంకెళ్లు, తాళ్లు, రిబ్బన్లు కట్టుకుని టీడీపీ శ్రేణులు, ప్రజలు నిరసన తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది.
నారా భువనేశ్వరి, లోకేష్ కూడా నిరసనల్లో పాల్గొన్నారు. రాజమండ్రి టీడీపీ ఆఫీస్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చయ్య చౌదరి, చిన్నరాజప్ప, కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఇక హైదరాబాద్‌లో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నారా లోకేష్ నిర్వహించారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని, ఆధారాలు లేకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని, జగన్ గూబగుయ్యిమనిపించేలా న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 37 రోజులైనా స్కిల్ కేసులో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని, చంద్రబాబు బరువు తగ్గలేదని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.