వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

by Jakkula Mamatha |   ( Updated:2024-09-11 14:52:07.0  )
వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
X

దిశ,ఏలూరు:ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ఏలూరు చేరుకున్నారు. అంతకు ముందు ఆయన హెలికాప్టర్ ద్వారా తమ్మిలేరు, రామిలేరు వరదలు, కొల్లేరు వరద పరిస్థితిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్‌లో ఏలూరు సర్ సి.ఆర్ రెడ్డి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి కొత్త బస్టాండ్ ప్రాంతంలో తమ్మిలేరు బ్రిడ్జి నుంచి వరద పరిస్థితిని చూశారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఏలూరు జిల్లాలో తమ్మిలేరు, రామిలేరు, కొల్లేరు వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. ఆ తర్వాత రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story