వైసీపీ చచ్చిన పాము లాంటిది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Anjali |
వైసీపీ చచ్చిన పాము లాంటిది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ పార్టీపై అదోని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ పార్థసారధి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తన వెంట నడిచిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆదోనిలో అడుగపెట్టిన నాటి నుంచి తన వెన్నంటి ఉండి, విజయానికి తోడ్పాటు అందించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అనంతరం ఆయన్ను కూటమి కార్యకర్తలు, అభిమానులు పార్థసారధిని ఎత్తుకుని విజయకేతనాన్ని ఎగరవేశారు. వైసీపీ చచ్చిన పాము లాంటిదని అన్నారు. కూటమి గెలుపు.. ప్రజల గెలుపు అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story