బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

by Jakkula Mamatha |
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
X

దిశ, ఏలూరు:ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి నిందితుడిని 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ కథనం ప్రకారం కుక్కునూరు మండలంలోని గ్రామంలో ఈ నెల 25న స్కూల్ నుండి ఇంటికి వచ్చి తిరిగి నానమ్మ ఇంటి వద్దకు వెళ్లి స్నేహితులతో ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను పునుగులు ఇస్తానని మాయమాటలు చెప్పి మడకం వెంకటేష్ అనే వ్యక్తి సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ట్రాక్టర్ లో ఎక్కించుకొని గోదావరి ఒడ్డుకు తీసుకు వెళ్లి పాడుబడిన పెంకుటిల్లు వద్ద బాలిక పై అఘాత్యనికి పాల్పడ్డాడు. తిరిగి రాత్రి 08:30 గంటలకు బాలికను తన ఇంటి దగ్గరలో దింపి వెళ్లగా జరిగిన విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పింది.

వెంటనే బాలిక తల్లిదండ్రులు కుక్కునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే కుక్కునూరు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి వెంటనే బాధిత బాలికను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం తరలించారు . ఈ కేసులో నిందితుడు మడకం వెంకటేష్ ని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు పోలవరం డీఎస్పీ యన్.సురేష్ కుమార్ రెడ్డి, కుక్కునూరు సీఐ వి.శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో కుక్కునూరు ఎస్ ఐ ఎస్.రామ కృష్ణ 24గంటల్లో ముద్దాయిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలవరం డిఎస్పి సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమానుషమైన సంఘటనకు పాల్పడిన ముద్దాయికి త్వరితగతిన శిక్ష విధించేందుకు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు

Advertisement

Next Story