Breaking: రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు రద్దు

by srinivas |
Breaking: రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు రద్దు
X

దిశ వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(Coalition Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ వక్ఫ్ బోర్డు(Ap Waqf Board)ను రద్దు చేసింది. ఈ మేరకు 47 జీవోను ఉపసంహరించింది. త్వరలో కొత్త వక్ఫ్ బోర్డు నియమించేందుకు కసరత్తులు చేస్తు్న్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా జగన్ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు అయింది. ఇందుకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం 47 జీవోను జారీ చేసింది. అయితే వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీంతో బిల్లును రద్దు చేసింది.

అటు కేంద్రప్రభుత్వం కూడా వక్ఫ్ బోర్డు భూముల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఈ మేరకు సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకుంది. ఈ బిల్లును కూటమి పార్టీలు సమర్థించగా ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బిల్లును స్వాతించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకించింది.

Advertisement

Next Story

Most Viewed