- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Gudivada: కోటిన్నర కొట్టేసి చెక్కేసింది..!
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడలో లిలావతి అనే మహిళ కోటిన్నర కొట్టేసింది. ప్రైవుటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇప్పిస్తానంటూ స్థానిక మహిళలకు మాయ మాటలు చెప్పింది. లీలావతి మాటలను గుడివాడ లక్ష్మీనగర్ కాలనీ, బాపూజీనగర్, చౌదరిపేట, ఆర్టీసీ కాలనీ, టిడ్కోకాలనీ, జగనన్న కాలనీకి చెందని మహిళలు నమ్మారు. వీరిని 60 గ్రూపులుగా ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించింది. అయితే వీరికి మంజూరైన రుణాల్లో ఎవరికీ తెలియకుండా లీలావతి కోటిన్నర కాజేశింది. అనంతరం అక్కడి నుంచి చెక్కేసింది. పైగా మహిళల బంగారాన్ని సైతం పలువురి వద్ద తాకట్టు పెట్టించింది. రుణాలు చెల్లించకపోవడంతో మహిళలకు బ్యాంకు అధికారులు ఫోన్లు చేస్తున్నారు. ఇళ్ల వద్ద వెళ్లి రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో బాధిత మహిళలు గగ్గోలు పెడుతున్నారు. లీలావతి హైదరాబాద్ లో ఉందని తెలుసుకున్న బాధితులు అక్కడికి వెళ్లి వెతకారు. అయితే అక్కడ కూడా ఆమె లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. లీలావతిని పట్టుకుని తమకు న్యాయం చేయించాలని బాధిత మహిళలు కోరారు.