- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: సీఎం జగన్ కేసులపై శుక్రవారం విచారణ
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వైఎస్ జగన్ అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై సీబీఐ పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి జైలుకు సైతం వెళ్లారు. దాదాపు 16 నెలల పాటు చంచల్‌గూడ జైలులో జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై విడుదల అయి పదేళ్లు అయింది. జగన్ కేసులకు సంబంధించి ఈ పదేళ్లలో సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదా వేసింది.
దీంతో ఎంపీ రఘు రామకృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టు జాప్యం చేస్తోందని.. ఆ కేసులను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ కేసులను సీబీఐ కోర్టు 3071 సార్లు వాయిదా వేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా కోర్టు ఆదేశాలిచ్చిందని తెలిపారు. అటు వందల కొద్దీ దిశ్చార్జి పిటిషన్లు వేశారని చెప్పారు. డిశ్చార్జి పిటిషన్ల వల్ల కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉందని పిటిషన్‌లో ఎంపీ రఘురామ రాజు తెలిపారు. ఈ పిటిషన్ స్వీకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది.