సినిమా వాళ్లు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన వెధ‌వ‌ మాట్లాడాడు: మంత్రి ఆర్‌కే రోజా

by Seetharam |   ( Updated:2023-10-05 11:02:16.0  )
సినిమా వాళ్లు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన వెధ‌వ‌ మాట్లాడాడు: మంత్రి ఆర్‌కే రోజా
X

దిశ , డైనమిక్ బ్యూరో : లింగ వివక్షత అనేది సమాజంలో ఉండకూడదు అని పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. కొత్త జనరేషన్, యువతరం దానిని మార్చాలని సూచించారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌హిళా ప‌క్ష‌పాతి అని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళ సాధికారత సమావేశానికి మంత్రి ఆర్‌కే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా ప్రసంగించారు. మహిళలపట్ల సమాజం ధోరణి మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కాలంలో మహిళలపై అసభ్యపదజాలంతో దూషణలకు దిగడం పరిపాటిగా మారిందని ఇది రాబోయే రోజుల్లో ప్రమాదకరం అని అన్నారు. ఈ సందర్భంగా తనపై మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.సినిమా వాళ్లు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన వెధ‌వ‌ మాట్లాడాడు అంటూ మండిపడ్డారు. మనం చేస్తున్న పని తప్పా? కాదా? అని మనకు తెలిస్తే చాలు.. మన మనసాక్షికి తెలిస్తే చాలు అని రోజా హిత బోధ చేశారు. ఎవరో ఎదో తిట్టారని భయపడి వెనక్కి అడుగు వేయకుండా ముందుకే వెళ్లాలని మంత్రి సూచించారు. మహిళల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశానని ఇంకా చేస్తానని మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. అలాగే ప్రతీఒక మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. కానీ స్త్రీ విజయం వెనుక ఒక స్త్రీ నే ఉంటుందని మంత్రి ఆర్‌కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.

మహిళలు వెనక్కితగ్గొద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళా పక్షపాతి అని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. మహిళల సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని చెప్పుకొచ్చారు. చరిత్రలో ఎవరు చేయని విధంగా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. లక్షలాది మహిళల అకౌంట్స్‌లో నేరుగా నగదు జమ చేస్తున్నారని.. అలాగే నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని కొనియాడారు. మహిళలు పాలు ఇచ్చే స్థాయి నుంచి పాలించే స్ధాయికి తీసుకెళ్లారని అన్నారు.దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం సంతోషంగా ఉందమంత్రి రోజా అన్నారు. రిజర్వేషన్ల ఇవ్వకుండానే ప్రపంచంలో మహిళలు ఎన్నో సాధించారని చెప్పుకొచ్చారు. విద్యా, సినిమా, రాజకీయం ఇలా అనేక రంగాలలో మహిళలను వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు. అయితే మహిళలు భయపడకూడదని... విమర్శలకు అసలు తలొద్దని సూచించారు. సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉండాలని మంత్రి ఆర్‌కే రోజా సూచించారు.

Advertisement

Next Story

Most Viewed