భార్య గొంతు కోసి, రెండు చేతులు నరికేసిన భర్త.. ఎందుకంటే?

by GSrikanth |   ( Updated:2023-04-28 05:35:19.0  )
భార్య గొంతు కోసి, రెండు చేతులు నరికేసిన భర్త.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నిర్మలను భర్త దావీదు కత్తితో కిరాతకంగా నరికి చంపాడు. గొంతు కోసి, రెండు చేతులు నరికి సైకోలా ప్రవర్తించాడు. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుడు దావీదును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story