Heavy Flood:ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద..పాపికొండలు విహార యాత్రకు బ్రేక్

by Jakkula Mamatha |   ( Updated:2024-09-11 14:51:58.0  )
Heavy Flood:ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద..పాపికొండలు విహార యాత్రకు బ్రేక్
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో ఇప్పటికీ వాగులు(streams), చెరువులు(Ponds), నదులు(rivers) వరదలతో ఉప్పొంగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా విజయవాడ(Vijayawada) జిల్లాను వరదలు(floods) ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోదావరి నది(Godavari River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరదలు(Heavy Floods) వస్తున్నందున ప్రవాహం పెరుగుతుంది. ఈ క్రమంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో నేడు(బుధవారం) రెండో ప్రమాద హెచ్చరికను(Warning) జారీ చేశారు. గోదావరి ఉగ్రరూపం(Godavari is fierce) దాల్చడంతో పాపికొండల యాత్రను(Papikondalu Yatra) అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గన్నవరం మండలం, మామిడికుదురు మండలాల్లో కాజ్ వేలు నీట మునగడంతో స్థానిక ప్రజలు నాటు పడవలపై ప్రయాణిస్తున్నారు. అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది.

చింతూరు మండలంలో 22 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వీఆర్‌ పురం మండలంలోని ప్రధాన రహదారుల(Main roads)ను వరద ముంచెత్తడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత(flood Effect) ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను, పునరావాస కేంద్రాలను(Rehabilitation centers) ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. దీంతో పెరుగుతున్న వరద ప్రవాహం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story