- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో శుక్రవారం రాత్రి మరో రైలు ప్రమాదం తప్పింది. కదిరి రైల్వేస్టేషన్ సమీపంలోని కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది.. నాగర్ కోయిల్ జంక్షన్ -ముంబయి సీఎస్‌ఎంటీ రైలు వచ్చే సమయంలో గేట్‍మెన్ గేటు వేయలేదు. దీంతో వాహనాలు రైల్వే గేటు నుంచి అటుఇటు తిరిగాయి. ఈలోపు రైలు రాకను గమనించి కొందరు స్థానికులు అప్రమత్తమై.. వాహనాలను నిలిపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కొందరు ట్రాక్ దాటసాగారు. అయితే ఇది గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. రైల్వే గేటుకు కొద్ది దూరంలో రైలు నిలిపివేశారు.
అనంతరం లోకో పైలట్ అక్కడి గేట్ మ్యాన్ రూమ్‌కు వెళ్లాడు. అక్కడ గేట్ మ్యాన్ కానీ, ఇతర రైల్వే సిబ్బంది కానీ కనిపించలేదు. అక్కడ ఎవరూ లేకపోవడంతో వాకీటాకీలో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రైల్వే గేటుకు కొద్ది దూరంలో లోకోపైలట్ రైలును నిలిపివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గేట్‌మెన్ చేసిన నిర్లక్ష్యంపై వాహనాదారులు, స్థానికులు మండిపడుతున్నారు. లోకో పైలట్ సకాలంలో స్పందించి రైలు ఆపకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి: