‘దేవర’ సినిమా చూసి చనిపోతా.. క్యాన్సర్​ పేషెంట్ కోరిక

by srinivas |   ( Updated:2024-09-12 06:19:12.0  )
‘దేవర’ సినిమా చూసి చనిపోతా.. క్యాన్సర్​ పేషెంట్ కోరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘దేవర’ సినిమా (Devara Movie) చూసి చనిపోతా.. సినిమా విడుదలయ్యే వరకు తనను బతికించాలంటూ క్యాన్సర్ పేషెంట్ చివరి కోరిక కోరారు. వివరాల్లోకి వెళితే తిరుపతిలో డిగ్రీ వరకు చదివిన కౌశిక్​(19) తండ్రి టీటీడీ కాంట్రాక్ట్​ డ్రైవర్‌గా పని చేస్తూ వినాయక నగర్​ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే కౌశిక్‌కు బోన్​క్యాన్సర్​ వచ్చింది. అతను జూనియర్​ ఎన్టీఆర్‌కు (Jr. Ntr) వీరాభిమాని. తనకు ఈ నెల 27న విడుదలయ్యే దేవర సినిమా చూపించాలని అప్పటి వరకు తనను బతికించాలని కోరుతున్నట్లు తల్లి సరస్వతి కోరారు. వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చవుతుందని దాతలు సహాయం చేయాలని వేడుకున్నారు.

Advertisement

Next Story