- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News: సి - విజిల్ తాకిడి..రెండు వారాల్లోనే 79వేల ఫిర్యాదులు
దిశ, ప్రతినిధి: ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కట్టిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఈసీ ఉక్కుపాదం మోపింది . అలానే ఎన్నికల కోడ్ ఉల్లంఘనను నియంత్రించేందుకు అనేక మార్గాలను ఈసీ అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వారిని గుర్తించేందుకు 'సీ-విజిల్' మొబైల్ అప్లికేషన్ ను తీసుకొచ్చింది.
ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లఘనకు పాల్పడుతుంటే.. ఈ 'సీ-విజిల్' మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చెయ్యవచ్చు. అయితే ఈ అప్లికేషన్ అమలులోకి వచ్చి రెండు వారాలు గడవకముందే ఈ అప్లికేషన్ ద్వారా 79వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే మెజార్టీ ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపింది. ''ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటినుంచి ఇప్పటివరకు కోడ్ ఉల్లంఘనలపై (MCC) 79వేల ఫిర్యాదులు వచ్చాయి.
వీటిలో దాదాపు 99శాతం సమస్యలను పరిష్కరించాం. 89శాతం కేసులను 100 నిమిషాల్లోనే పూర్తిచేశాం. 58,500 ఫిర్యాదులు అక్రమ హోర్డింగులు, బ్యానర్ల గురించే వచ్చాయి. నగదు, తాయిళాలు, మద్యం పంపిణీకి సంబంధించి 1400లకుపైగా కంప్లెయింట్‌లు వచ్చాయి. స్థలాల అక్రమ వినియోగం, మారణాయుధాలతో బెదిరింపులు, సమయం ముగిసిన తర్వాత ప్రచారం వంటి ఫిర్యాదులు వందల సంఖ్యలో వచ్చాయి'' అని ఈసీ తెలిపింది.
కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు సీ-విజిల్ అనేది పౌరుల చేతుల్లో ఉన్న సమర్థమంతమైన సాధనమని పేర్కొంది. ఇది ఇలా ఉంటే, సీ-విజిల్ అనేది ఎన్నికల సంఘం రూపొందించిన ఫాస్ట్ ట్రాక్ మొబైల్ యాప్. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనలపై సాక్ష్యాధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. వీటిని ఈసీ నిమిషాల్లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది.
ముఖ్యంగా నగదు, మద్యం, మాదక ద్రవ్యాల పంపిణీ, తాయిలాలతో ప్రలోభపెట్టడం, రెచ్చగొట్టే ప్రసంగాలు, అసత్య ప్రచారాలకు సంబంధించి ఏవైనా ఫొటోలు, వీడియోలు ఈ యాప్ ద్వారా ఈసీకి పంపించవచ్చు. మొత్తం మీద 100 నిమిషాల్లో ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది.