AP:ఆగస్టు 1న నూటికి నూరు శాతం పింఛన్ల పంపిణీ:జిల్లా కలెక్టర్

by Jakkula Mamatha |
AP:ఆగస్టు 1న నూటికి నూరు శాతం పింఛన్ల పంపిణీ:జిల్లా కలెక్టర్
X

దిశ,అమలాపురం: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ప్రక్రియను పక్కా కార్యాచరణ ప్రణాళికలతో సాధ్యమైనంత వరకు మొదటి రోజునే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎంపీడీవోలను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ సన్నద్ధత అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చక్కటి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి ఆగస్టు ఒకటో తేదీనే పెన్షన్ నూటికి నూరు శాతం పంపిణీ చేయాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా 28 కేటగిరీలలో 2,43,402 మందికి గాను రూ 101 కోట్ల 30 లక్షల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇంటింటికి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు ఆగస్టు 2024 నెల పెన్షన్ పంపిణి ప్రక్రియను ఆగస్టు 1 వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రారం భించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ముందస్తుగా ఆగస్టు 1వ తేదీ పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం, సామాజిక మాధ్యమాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,258 మంది సిబ్బంది ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తారన్నారు.

పెన్షన్ పంపిణీ చేసే సిబ్బందికి పెన్షన్ దారులను మ్యాప్ చేయడం జరిగిందన్నారు చెల్లించని పింఛన్లన్నింటికీ చెల్లించక పోవడానికి గల కారణాలు సంక్షేమ సహాయకులు ఆన్లైస్ నందు తప్పనిసరిగా పొందుపర చాలన్నారు..గతంలో నియమించిన సిబ్బందినే కాకుండా అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియ మించు కోవాలన్నారు పింఛన్‌ల లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛను బట్వాడా పింఛన్ పంపిణీ ధ్రువపత్రం ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పిడివి శివశంకర్ ప్రసాద్ ఎల్‌డిఎం వర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story