విజయ్‌ను ఆకాశానికెత్తేసిన అనన్య పాండే

by Jakkula Samataha |
విజయ్‌ను ఆకాశానికెత్తేసిన అనన్య పాండే
X

దిశ, వెబ్‌డెస్క్: పూరీ జగన్నాద్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌ అంటేనే ఫ్యాన్స్ దిమ్మతిరిగే బ్లాక్ బస్టర్ ఖాయం అనుకున్నారు. విజయ్‌కు జోడీగా బాలీవుడ్ ప్రెట్టీ గాళ్ అనన్య పాండేను సెలెక్ట్ చేశారని తెలిశాక… పూరీ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోతుందనుకున్నారు. సెట్‌ నుంచి విజయ్, అనన్య ఫోటోలు రిలీజ్ అయ్యాక… ఈ జంటను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడడంతో .. సినిమా రిలీజ్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అందాల భామ అనన్య పాండే… విజయ్ దేవరకొండను ఆకాశానికి ఎత్తేసింది. విజయ్ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదని చెప్పింది. అస్సలు స్టార్ హీరోలా బిహేవ్ చేయడని.. చాలా హుందాగా ఉంటాడని తెలిపింది. ప్రతీ ఒక్కరితో సున్నితంగా మాట్లాడుతాడని చెప్పుకొచ్చింది. చాలా దయ కలిగిన నిజమైన హీరో విజయ్ అని ప్రశంసలు కురిపించింది. అంతేకాదు విజయ్‌ ఈ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంటే… తను సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నానని… తొలి సినిమాతో మరో ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకులను మెప్పించగలమా అనే భయం ఇద్దరిలోనూ ఉందని తెలిపింది. కానీ సినిమాకు భాష అడ్డు కాదని నమ్ముతానన్న అనన్య… ‘పారాసైట్’ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుని దీన్ని రుజువు చేసిందని చెప్పింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్న సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నిస్తానంటోంది అనన్య. కాగా కరణ్ జోహార్, చార్మి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.

Tags : Vijay Devarakonda, Ananya Pandey, Bollywood, Puri Jagannad,Karan Johar, Charmee

Advertisement

Next Story