‘బీహార్‌ను మించిన తెలంగాణ’

by Shyam |   ( Updated:2020-03-14 08:47:32.0  )

దిశ, న్యూస్‌ బ్యూరో: స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్‌లో రైతులకు అందాల్సిన కోళ్ల దాణ మక్కల విక్రయాల్లో జరిగిన కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీహార్‌లో జరిగిన పశువుల దాణ కుంభకోణం కంటే రాష్ట్రంలో జరిగిన కోళ్ల దాణ కుంభకోణం చాలా పెద్దదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మక్కల విక్రయాల్లో జరిగిన అవకతవకలపై వివరణ కోరినా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వ ఉందన్నారు. సమధానం ఇవ్వకపోగా సీఎం కేసీఆర్ మక్కలు ఎవ్వడు తింటడయ్యా అని అవహేలన చేసి మాట్లాడడం సరైంది కదన్నారు. చిన్న, సన్న‌కారు రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వ్యాపారులకు అండగా నిలుస్తుందన్నారు. కోళ్ల దాణ కుంభకోణంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నందునే ఆ విషయం పై అసెంబ్లీలో చర్చకు రానివ్వడం లేదన్నారు. ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే రూ.300కోట్ల మక్కల కుభంకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Tags: scam, cbi, trs, kcr, kodanda reddy, farmer

Advertisement

Next Story