జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తా: అమిత్ మిశ్రా

by Shyam |
జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తా: అమిత్ మిశ్రా
X

దిశ, స్పోర్ట్స్: భారత జట్టులో తిరిగి చోటు సంపాదించుకుంటానని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ధీమా వ్యక్తం చేశాడు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ మిశ్రా జాతీయ జట్టులో స్థానం గురించి స్పందించారు

తాను ఐపీఎల్ ఆడటానికి మాత్రమే ప్రాక్టీస్ చేయట్లేదని, జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడానికీ శ్రమిస్తున్నానని చెప్పాడు. జాతీయ జట్టులో ఎలాగైనా చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమన్నాడు. ఎన్నటికైనా తన లక్ష్యం నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, మిశ్రా చివరిగా 2017 ఫిబ్రవరిలో భారత్ తరుఫున టీ20 ఆడాడు. 2016లో చివరిగా టెస్ట్‌లలో కనిపించాడు. అప్పటి నుంచి ఫామ్ కోల్పోయిన మిశ్రా భారత జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

Advertisement

Next Story