సీక్రెట్‌గా బిడ్డను కన్న హీరోయిన్

by Shyam |   ( Updated:2021-07-02 02:34:42.0  )
Amber Heard becomes a mom
X

దిశ, సినిమా: హాలీవుడ్ యాక్ట్రెస్ అంబర్ హర్డ్ రహస్యంగా బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్న ఆమె.. తన ఎదపై నిద్రపోతున్న బేబీ ఫొటోను షేర్ చేసింది. ఏప్రిల్ 8. 2021న బిడ్డ పుట్టినట్లు తెలుపుతూ.. నాలుగేళ్ల క్రితం తాను సంతానం పొందాలని నిర్ణయించుకున్నానని, తన సొంత నిబంధనల ప్రకారమే ఇలా చేశానని చెప్పింది.

బిడ్డను కనేందుకు పెళ్లి తప్పదన్న నిబంధన లేని రోజులు రావాలని కోరుకుంటున్నానని.. శిశువును కనడం అనేది మహిళల విధి, ప్రాథమిక విభాగాలలో ఒకటిగా సమాజం ఆలోచించడాన్ని అభినందిస్తున్నానని తెలిపింది. వ్యక్తిగత జీవితం తన చేతుల్లో మాత్రమే ఉండాలి తప్ప ఇతరులు దాన్ని ప్రభావితం చేయకూడదన్న అంబర్.. కుమార్తె ఓనాగ్ పైజ్ హర్డ్‌ను తన మిగిలిన జీవితానికి ప్రారంభంగా అభివర్ణించింది.

Advertisement

Next Story