- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వజ్రం కన్నా కఠినమైన గ్లాస్.. వెపన్స్ తయారీలో యూజ్‌ఫుల్ ?
దిశ, ఫీచర్స్ : వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయాలన్న సామెత వినే ఉంటారు. వజ్రం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో తెలిపేందుకే ఈ మాట వాడుతుంటారు. అయితే ఏదైనా గ్లాస్‌ను వజ్రంతో కట్ చేయడం సులభమే. కానీ, వజ్రంపైన సింపుల్‌గా లోతైన గాటు పెట్టగల మెటీరియల్ ఉందనడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నార్తర్న్ చైనాకు చెందిన పరిశోధకుల బృందం ఇప్పుడు అలాంటి పదార్థాన్నే డెవలప్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన గ్లాస్ మెటీరియల్‌ను ఆవిష్కరించింది.
చైనీస్ శాస్త్రవేత్తలు.. హై-టెక్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించేందుకు గాను వజ్రం వలె గట్టిగా ఉండే AM-III(తాత్కాలిక పేరు) అనే గాజు పదార్థాన్ని అభివృద్ధి చేసినట్లు సమాచారం. సెమీకండక్టర్ అయిన ఈ AM-III గుండా విద్యుత్ ప్రవహించగలదని రిపోర్టులు చెబుతున్నాయి. బుల్లెట్‌ప్రూఫ్ విండో తయారీలోనూ ఉపయోగించే కార్బన్‌తో ఇది రూపొందించబడింది. ఇది సిలికాన్ మాదిరి సమర్థవంతమైన సెమీకండక్టర్ అని వారు నివేదికలో పేర్కొన్నారు.
ఫోటో ఎలక్ట్రిక్ పరికరంగా ఉపయోగపడటంతో పాటు విపరీతమైన ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం AM-IIIకు ఉన్నందున ఆయుధాలను తయారీలో ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే దీన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుంది. AM-III బుల్లెట్ ప్రూఫ్ నాణ్యత మార్కెట్లో లభించే సాంప్రదాయ ఉత్పత్తి కంటే 20-100 రెట్లు మెరుగ్గా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు పారదర్శకత గల AM-IIIని వివిధ ఆకారాలు, పరిమాణాల్లో కూడా ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.