- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రెయిన్ మ్యాజికల్ ఫ్యూచర్
దిశ, ఫీచర్స్: మానవుని మెదడు కంప్యూటర్ కన్నా శక్తివంతమైందని తెలిసిన విషయమే. లిప్తపాటు కాలంలోనే కొన్ని వేల ఆలోచనలు మెదడులో ఉద్భవిస్తాయి. సెకనులో వందల రెట్ల వేగంతో అవయవాల పనితీరును సమన్వయపరుస్తుంది. గిగాబైట్ల మెమోరీని స్టోర్ చేసుకుంటుంది. ఇంతటీ ఆశ్చర్యకరమైన బాడీ పార్ట్ మరోటి ఉండదేమో! అసలు బ్రెయిన్ పనితీరు ఎలా ఉంటుంది? అందులోని మెమొరీని నేరుగా డౌన్‌లోడ్ చేయగల సామర్థ్యమే ఉంటే? సూపర్ హ్యుమన్ ఇంటెలిజెన్స్ మనసొంతమైతే? అద్భుతాలు చేసేయొచ్చు కదా! మరి అలాంటి మిరాకిల్ సమీప భవిష్యత్తులోనే సాధ్యం కావచ్చు. అవును మీరు వింటున్నది నిజమే. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ ‘న్యూరా లింక్’ కంపెనీ ఆ దిశగా పనిచేస్తూ సత్ఫలితాలు సాధిస్తుంది.
2016లో న్యూరాలింక్ (Neuralink) అనే బ్రెయిన్ చిప్ స్టార్టప్‌ను ఎలన్ మస్క్ ప్రారంభించాడు. న్యూరాలింక్ అనేది బ్రెయిన్-మెషిన్ ఇంటర్‌ఫేస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. మెదడులో అమర్చడానికి రూపొందించిన కంప్యూటర్ చిప్. మానవ మెదడులో వంద బిలియన్ న్యూరాన్లు ఉండగా.. అవి ఒకదానికొకటి చాలా సంక్లిష్టమైన సర్క్యూట్‌లలో అనుసంధానించబడి ఉంటాయి. ఆలోచన, అనుభూతి, రుచి, వాసన వంటి అంశాలతో పాటు.. మనం చేసే ప్రతీది న్యూరాన్లలోని రసాయన ప్రతిచర్యల ఫలితమే. కేవలం 5 మైక్రోమీటర్ల వెడల్పు ఉన్న చాలా సన్నని థ్రెడ్ల ద్వారా ఈ న్యూరాన్‌లను కంప్యూటర్ చిప్‌కు కనెక్ట్ చేయాలని న్యూరాలింక్ యోచిస్తోంది.
మానవులు ప్రాథమికంగా ఇప్పటికే సైబోర్గ్‌లు కలిగి ఉన్నారు. ఉదాహరణకు.. సెల్‌ఫోన్ కలిగి ఉన్న మనిషి ఓ సైబోర్గ్. సెల్‌ఫోన్ ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలదు. ప్రపంచంలో ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయగలదు. అనంతమైన జ్ఞాపకాలను క్యాప్చర్ చేసి స్టోర్ చేస్తుంది. ఇంకా మరెన్నో.. అయితే ఫోన్‌కు, మనిషికి మధ్య బ్యాండ్ విడ్త్ చాలా ఎక్కువ. మన ఫోన్‌ను బయటకు తీయడానికి, దాన్ని అన్‌లాక్ చేయడానికి, ఏదైనా టైప్ చేయడానికి మనకు ఎంత సమయం పడుతుందో.. మనం ఆలోచించే సమయం కంటే వేల రెట్లు ఎక్కువ. అదే మెదడులో నేరుగా ఓ చిప్‌ను అమర్చితే సెకన్లలో పనులు జరిగిపోతాయి. శారీరకంగా చక్కగా ఉన్నవాళ్లు తమ పనులు తాము చేసుకోగలరు. కానీ మెదడుతో సరైన సంబంధం లేని వారి పరిస్థితి ఏంటీ? న్యూరాలింక్ ఇలాంటి న్యూరోలాజికల్ డిజార్డర్స్‌ను కూడా పరిష్కరించగలదు. మెదడులోని న్యూరాన్‌లను చిప్‌తో అనుసంధానించడం ద్వారా అంధత్వం లేదా చెవుడు వంటి సమస్యలను కూడా పరిష్కరించగలదు. అది ఆప్టికల్ లేదా ఆడిటరీ సెన్సార్‌కు కనెక్ట్ అవుతుంది. డైమెన్షియా, అల్జీమర్స్ (మతిమరపు) వంటి సమస్యలు ఉన్నవారికి నాడీ సంబంధిత సమస్యల నుంచి కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం న్యూరాలింక్ ఎలుకలు, పందులపై ప్రయోగాలు చేస్తుండగా.. ఇటీవలే చింపాంజీపై కూడా టెస్ట్ చేసి సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలోనే ఏడాది చివరికల్లా మానవులతో న్యూరాలింక్ ప్రయోగాలు ప్రారంభించాలని యోచిస్తుంది. న్యూరాలింక్ మొదట తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడుతుంది. కానీ చివరికి మానవ మెదడు సామర్థ్యాలను పెంచడమే దీని లక్ష్యం. చిప్ అన్ని న్యూరాన్లతో కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. కానీ మెదడులోని న్యూరాన్ల చిన్న భాగానికి కూడా కనెక్ట్ అవ్వడం వల్ల గణనీయమైన ఫలితం పొందవచ్చని న్యూరాలింక్ చెబుతోంది. ఉదాహరణకు.. మీ మెదడు ఇంటర్నెట్ సదుపాయంతో కంప్యూటర్ చిప్‌కు అనుసంధానించిందని ఊహించుకోండి. ఇప్పుడు మీ ఆలోచనలను ఉపయోగించి ఏదైనా గూగుల్ చేస్తే.. ఫలితాలు మిల్లీ సెకన్లలో కనిపిస్తాయి. అదే ఫోన్‌లో ఇప్పుడు చేస్తున్న సెర్చ్ ఫలితం కంటే వేల రెట్లు వేగంగా రిజల్ట్ వస్తుంది. అంతేకాదు జ్ఞాపకాలన్నీ కూడా క్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. ఇక కమ్యూనికేషన్ సరికొత్త కోణంలో సాగుతుంది.
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందితే అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా ఉంటాయి. డిజిటల్ ప్రపంచంలో మన ప్రతీ విషయాన్ని ఇప్పుడు ఫోన్ వెల్లడిస్తుంది. అయినా మన ఆలోచనలు సురక్షితంగానే ఉన్నాయి. కానీ న్యూరాలింక్ వస్తే… ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మెదడును హ్యాక్ చేసే హ్యాకర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదీ ఏమైనా.. మెదడులో చిప్‌ను వ్యవస్థాపించాలనుకుంటే అది స్వచ్ఛందంగా, పూర్తిగా వ్యక్తి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.