జగన్‌ను నమ్ముకున్నోళ్లంతా జైలుకే : చంద్రబాబు

by srinivas |
Chanrdababu
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్‌ను నమ్ముకున్నోళ్లంతా జైలుకు వెళ్లారు. ఆయన కోసం తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారవుతుంది. పోలీసులు కూడా హుందాగా పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. మచిలీపట్నంలో ఇటీవలే మృతి చెందిన మాజీమంత్రి నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడిన చంద్రబాబు టీడీపీ హయాంలో ఎన్నో సంక్షోభాలు వచ్చినా, వాటిని సవాలుగా తీసుకుని పని చేశామన్నారు. అయితే సీఎం జగన్ కరోనని కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉంటే కరోనను సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్లమని చెప్పుకొచ్చారు. రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

డబ్బులు అడిగిన రైతులపై మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకెంతకాలం పరిపాలిస్తారని ప్రశ్నించారు. రైతులు తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు. పోలీసులు కూడా హుందాగా పని చేయాలని చంద్రబాబు హితవు పలికారు.

Advertisement

Next Story