- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెప్టెంబర్ 5లోగా టీచర్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి -మన్సుఖ్ మాండవీయా
దిశ వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5లోగా టీచర్లందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయా రాష్ట్రాలను కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం కన్నా ముందే టీచర్లకు టీకా అందించాలని సూచించారు. దీనికోసం రాష్ట్రాలకు అదనంగా 2కోట్ల టీకా డోసులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర మంత్రి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘అన్ని రాష్ట్రాలు ఉపాధ్యాయ దినోత్సవానికి(సెప్టెంబర్ 5) ముందే టీచర్లకు వ్యాక్సిన్లు అందించాలని మేము కోరుతున్నాం. దీనికోసం అదనంగా రెండు కోట్ల టీకా డోసులను అందుబాటులో ఉంచాం’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా, కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టీచర్లకు, అర్హులైన విద్యార్థులకు టీకాలు అందించి విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాయి. మధ్యప్రధేశ్ విద్యా శాఖ బుధ, గురువారాల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, అర్హులైన వారికి ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించింది. కాగా కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నెలలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించినా సెకండ్ వేవ్ రాకతో మరోసారి మూతపడ్డాయి. రెండో దశలో కొవిడ్-19 కేసులు తగ్గడంతో చాలా రాష్ట్రాలు విద్యాసంస్థలను పున:ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. మరోవైపు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది.