వెల్దండ ఎస్సై‌ చాలా మంచోడు.. చెడు ప్రచారం చేయొద్దన్న నాయకులు

by Shyam |   ( Updated:2021-11-15 06:53:47.0  )
వెల్దండ ఎస్సై‌ చాలా మంచోడు.. చెడు ప్రచారం చేయొద్దన్న నాయకులు
X

దిశ, వెల్దండ: వెల్దండ ఎస్ఐ నర్సింహ్మ మంచితనానికి మారుపేరని అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నిజాలు తెలుసుకోకుండా కావాలనే కొందరు ఉద్దేశ పూర్వకంగా ఎస్సై నర్సింహ పై ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో అవాస్తవమైన వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. కులమతాలకు అతీతంగా పని చేస్తున్న ఎస్సై నర్సింహులుకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ అండగా ఉంటారన్నారు. పెద్దాపూర్, కుప్పగండ్ల గ్రామాలకు చెందిన ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై నర్సింహులు పై బురద చల్లడం సమంజసం కాదన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జైపాల్ నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పోలేరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు శేఖర్, బీజేపీ ఎంపీటీసీ చక్రవర్తి, సర్పంచ్ దార్ల కుమార్, ఎంపీటీసీ వెంకటయ్య, సర్పంచ్‌లు రేవతి రాజశేఖర్, తిరుమల రావు, డీలర్ల సంఘం అధ్యక్షులు జంగయ్య, పుల్లారావు, గుత్తి జంగయ్య, గిరిజన నాయకులు శంకర్ నాయక్, రాజు నాయక్, లాలు నాయక్ పాల్గొన్నారు.

Advertisement

Next Story