రికార్డు బుకింగ్‌లతో దూసుకెళ్తున్న క్రెటా వెర్షన్

by Harish |
రికార్డు బుకింగ్‌లతో దూసుకెళ్తున్న క్రెటా వెర్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ మోడల్ క్రెటా అద్భుతమైన ఆదరణతో దూసుకెళ్తోంది. ప్రస్తుత ఏడాది మార్చిలో మార్కెట్లోకి తీసుకొచ్చిన క్రెటా వెర్షన్ రికార్డు స్థాయిలో బుకింగ్‌లను సాధించి మార్కెట్ లీడర్‌గా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. క్రెటా కొత్త వెర్షన్ ఏకంగా 55,000 బుకింగ్‌లు వచ్చినట్టు బుధవారం కంపెనీ పేర్కొంది.

ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే నుంచి జూన్ మధ్యకాలంలో అధిక విక్రయాలను నమోదు చేసినట్టు హ్యూండాయ్ మోటార్ ఇండియా వెల్లడించింది. ఈ మోడల్ కారు 2015లో ప్రారంభమైనప్పటి నుంచే పరిశ్రమలో దూసుకెళ్తోందని, ఇప్పటివరకు 4.85 లక్షలకు పైగా విలువైన వినియోగదారులను సంపాదించినట్టు హ్యూండాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సర్వీసెస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ వెల్లడించారు. కేవల నాలుగు నెలల కాలంలో క్రెటా వెర్షన్ 55 వేల బుకింగ్‌లు, 20 వేల మందికి పైగా వినియోగదారులతో ఎస్‌యూవీ విభాగంలో ఆధిపత్యాన్ని దక్కించుకుందని తరుణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆదరణను నోచుకోవడం కంపెనీ ఎస్‌యూవీ పనితీరుకు నిదర్శనమని తెలిపారు.

Advertisement

Next Story