- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్య రోజు ఆ పని చేయడంలేదని విడాకులు కోరిన భర్త.. షాక్ అయిన అధికారులు
దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు ఎన్ని ఉన్నా.. కలిసి ఉండాలనుకోవడమే ప్రేమ.. కానీ ప్రస్తుత కాలంలో చిన్న చిన్న కారణాలతోనే భార్యాభర్తల బంధానికి స్వస్తి చెప్తున్నారు. అందుకే కోర్టు ఎదుట విడాకుల కోసం కొట్టుకొనే జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విడాకులు కావాలంటే ఒక బలమైన కారణముండాలి.. భర్త హింసిస్తున్నాడనో, భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనో ఇలాంటి కారణాలు ఇప్పటివరకు చాలాసార్లు వినే ఉంటాం. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే భర్త మామూలు కారణం చెప్పలేదు. తన భార్య రోజు స్నానం చేయడం లేదని, అందుకే తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతు కోర్టుకెక్కిన విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఈ ఘటన జరిగింది
వివరాలలోకి వెళితే.. క్వార్సీ గ్రామానికి చెందిన మహిళకు చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అవ్వగా.. ఏడాది వయసున్న పాప ఉంది. అయితే, పెళ్లైన దగ్గరనుంచి భార్య రోజు స్నానం చేయడం లేదని భర్త కోపగించుకొనేవాడు. ఈ విషయంపై వారిద్దరూ ప్రతి రోజూ వాదులాడుకునేవారు. దీంతో విసుగు చెందిన భర్త, భార్యకు విడాకులు ఇచ్చేందుకు మూడు సార్లు తలాక్ చెప్పాడు. అయితే భర్తపై వ్యతిరేకంగా భార్య వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తన భర్త నుంచి తనకు విడాకులు వద్దని, తనను వదిలించుకోవడానికే ఇలాంటి సాకులు చెప్తున్నట్లు ఆమె ఆరోపించింది. కానీ, భర్త మాత్రమే తన భార్యతో ఎలాగైనా విడాకులు ఇప్పించాలని పట్టుబట్టడం విశేషం. అయితే, సమస్య చిన్నది కావడంతో అలీగఢ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలింగ్ వారు వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. విడాకులు తీసుకొంటే పిల్లల భవిష్యత్ పాడైపోతుందని, చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకొంటే వివాహ బంధంపై నమ్మకంపోతుందని తెలిపి సర్దిచెప్తున్నారు. అంతేగాక విడాకుల దరఖాస్తుకు భర్త చెప్పిన కారణం ఏ హింసాత్మక చట్టం, మహిళలపై నేరం కిందకు రాదు కాబట్టి, పిటిషన్ ముందుకు సాగదన్నారు. ప్రస్తుతం వారికి కౌన్సిలింగ్ జరుగుతోందని అధికారులు తెలిపారు.
- Tags
- Divorce