హ్యాపీ బర్త్‌డే ముఫాసా : అలియా

by Anukaran |
హ్యాపీ బర్త్‌డే ముఫాసా : అలియా
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అలియా భట్, ఆమె తండ్రి మహేష్ భట్.. సుశాంత్ సింగ్ విషయంలో ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నారు. నెపోటిజానికి కేరాఫ్ అడ్రస్ అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. వారి నుంచి ఎలాంటి సినిమా వచ్చినా సరే ఆదరించకూడదని నిర్ణయించారు. ‘సడక్ 2’ విషయంలో అనుకున్నది చేసి చూపించారు కూడా. మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్ 2’లో అలియా భట్ మెయిన్ రోల్ కాగా.. అత్యంత డిస్‌లైక్స్ కలిగిన ట్రైలర్‌గా యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. మరోవైపు కంగనా రనౌత్.. మహేష్ భట్ తనను హింసించేవాడని ఆరోపణలు చేసింది. ఈ సంఘటనలన్నీ దృష్టిలో ఉంచుకుని కుంగిపోకూడదని మహేష్ భట్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విష్ చేసింది అలియా.

‘చాలా కాలంగా లేదా తెలివిగా చెప్పేందుకు నా దగ్గర ఏమీ లేదు’ అంటూనే చాలా గొప్పగా తండ్రికి శుభాకాంక్షలు అందించింది. మహేష్ తనను ఆడిస్తున్న చిన్నప్పటి ఫొటో షేర్ చేసిన అలియా.. తండ్రి ఫేవరెట్ ఫిల్మ్ ‘ముఫాసా’ నుంచి ఫేవరెట్ డైలాగ్‌ను ఎంచుకుని తను ఎంత గొప్పవాడో చెప్పింది. ‘మీ లోపల చూసుకోండి.. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో! అంతకు మించిన గొప్పవారు.. మీరెవరో గుర్తుంచుకోండి’ అని తెలిపింది.

‘మీరు దేన్నీ నమ్మకండి.. దేని గురించి ఆలోచించకండి.. మీరు మంచి వ్యక్తి.. హ్యాపీ బర్త్ డే ముఫాసా’ అంటూ తండ్రికి బెస్ట్ విషెస్ అందించింది అలియా.

Advertisement

Next Story