చుక్క కోసం..ఎదురుచూపులు

by Shyam |
చుక్క కోసం..ఎదురుచూపులు
X

దిశ, రంగారెడ్డి: కరోనా మహమ్మారి (కోవిడ్ -19)తో భారత్ సహా ప్రపంచమంతా వణికిపోతోంది. ఈ వైరస్ కట్టడికి కేంద్రం ప్రకటించింది. ఈ లాక్ డౌన్‌తో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, మద్యం షాపులు సకలం మూతపడ్డాయి. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. అయితే, మద్యం దుకాణాల మూసివేతతో కొత్త సమస్య వచ్చింది. మద్యానికి బానిసైన వారు ఆ చుక్క కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అది అందుబాటులో లేకపోవడంతో గొంతులు కోసుకోవడం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి హాస్పిటళ్ల‌లో చేరుతున్నారు. మరి కొందరైతే మద్యానికి బదులు కల్లు తాగుతున్నారు. దీంతో కొందరు గీత కార్మికులు కల్లులో రసాయనాలు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఇది తాగి ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

చుక్క ఉంటే చాలు…

సమయానికి కడుపు నిండకా పోయిన పర్వాలేదు. కాని ఏదైనా సరే చుక్క ఉండాల్సిందే. మత్తు ఉంటేనే శరీరంలోని అవయవాలు పనిచేస్తాయన్నట్టు మద్యానికి బానిసైన వారు వ్యవహరిస్తున్నారు. రోజురోజుకూ మత్తు లేక పిచ్చిపిచ్చిగా చేసేవాళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందనీ, ఇప్పటికే అలా ప్రవర్తించే వారు ఆస్పత్రుల్లో పెద్దఎత్తున చేరుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్‌తో ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన వాళ్లు కల్లు చుక్క కోసం చివరకు గుడుంబా, నాటుసారాల కోసం గాలిస్తున్నారు. ఏదైతే ఏంటి..చుక్క..చుక్కే అని అంటున్నారు. అటవీ ప్రాంతంలోని తాటి చెట్ల కింద క్యూ కడుతున్నారు.

మద్యం కోసం పిచ్చిపిచ్చిగా ప్రవర్తించిన వారి వివరాలు..

– హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇందిరానగర్‌లో ఉంటున్న మధు అనే పెయింటర్‌ మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయి, భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఖైరతాబాద్ చింతల్ బస్తీ లోని వైన్ షాపు వద్ద ఓ మద్యం బాబు పీక కోసుకున్నాడు.

వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట

మండలం చించల్ పెట్ గ్రామంలో కల్తీకల్లు తాగి పాల్గుట్ట లక్మమ్మ అనే మహిళ మృతి చెందగా మరో 20 మందికి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు.రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలోని మద్యం బాబులకు మందు దొరకకపోవడంతో కల్తీ కల్లు అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కల్లు దుకాణాలు మూతపడటంతో కల్తీ కల్లు బాధితులు మతి స్థిమితం తప్పి ప్రవర్తిస్తున్నారు. నగరంలోని ముదిరాజ్‌గల్లిలో భూషణ్‌ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు.

Tags: liquor, mental disorder, non availability of liquor, lockdown, covid 19

Advertisement

Next Story