- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగార్జున అలా చేశారు.. దెబ్బకు దిగొచ్చిన అక్కినేని కోడలు.. డివోర్స్‌పై క్లారిటీ.!
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల నుంచి సమంత- నాగ చైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వీరి దాంపత్య జీవితం విడాకుల వరకు వచ్చి ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయిందనే టాక్ నడిచింది. అయితే సోమవారం సామ్ చేసిన ఓ పోస్టు ద్వారా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చినట్టే అని తెలుస్తోంది.
వారానికి పైగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ మారిన సమంత-నాగ చైతన్య విడాకుల ఇష్యూపై కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. చై-సామ్ మధ్య అభిప్రాయం బేధాల కారణంగానే విడాకుల వరకు వచ్చి ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయిందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇది నిజమే అన్నట్టుగా సమంత ఒంటరిగా టూర్స్ వేస్తుండటం, డివోర్స్ ఇష్యూపై ఎక్కడా స్పందించకపోవడం అటు అక్కినేని అభిమానులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. సామ్ బిహేవియర్ పలు అనమానాలను క్రియేట్ చేసింది.
ఈ పరిస్థితుల నడుమ సమంత ఏ చిన్న పోస్ట్ పెట్టినా అందరి చూపు దానిపైనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నాగార్జున షేర్ చేసిన ఓ పోస్ట్‌పై సమంత రిప్లై ఇవ్వడం, ఆ వెంటనే తాను పెట్టిన ట్యాగ్ లైన్ ఎడిట్ చేసి మరోలా రాయడం సరికొత్త సందేహాలు లేవనెత్తింది. ఇదంతా చూసి సమంత- నాగ చైతన్య డివోర్స్ అంశంపై క్లారిటీ ఇచ్చిందని ఫ్యాన్స్ అనుకోవడం విశేషం.
‘సెప్టెంబర్ 20వ తారీఖు.. నాకు చాలా స్పెషల్ డే.. నా హీరో, నా ప్రేరణ నాన్న గారి (అక్కినేని నాగేశ్వరరావు) పుట్టినరోజు’ అంటూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు నాగార్జున. ఇది చూసిన అక్కినేని కోడలు సమంత దాన్ని రీ ట్వీట్ చేస్తూ ‘ఇది చాలా బాగుంది’ అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే ఎప్పుడూ నాగార్జునను మామ అంటూ ముద్దుగా పిలిచే సామ్.. ఈ సారి మాత్రం నాగార్జున అని ఏకవచనంతో సరిపెట్టడంతో నెట్టింట రచ్చ మొదలైంది. సమంతపై కొంతమంది అక్కినేని ఫ్యాన్స్ ట్రోలింగ్ చేశారు.
దీంతో అది గ్రహించిన సమంత.. దెబ్బకు దిగొచ్చి ‘ఇది చాలా బాగుంది నాగార్జున మామ’ అంటూ తన ట్యాగ్ లైన్ ఎడిట్ చేసేసింది. దీంతో ‘మామ’ అనే పదంతో విడాకులపై సమంత చిన్న క్లారిటీ ఇచ్చేసిందని అభిమానులు చెప్పుకుంటున్నారు.
ముంబైకి మకాం మార్చనున్న సమంత.. అందుకేనా?
https://twitter.com/Samanthaprabhu2/status/1439926164034768900?s=20