ఆ యూజర్లకు.. ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్

by Harish |
ఆ యూజర్లకు.. ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ విస్తృత వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి దేశంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ కాలంలో ఎవరికీ సరిగా ఉపాధి లేక తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో.. ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.1,500తో ఎక్స్‌ట్రీమ్ బాక్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ యూజర్లకు రాయితీపై రూ.2,249కే ఈ బాక్స్‌ను అందిస్తోంది. ఈ బాక్స్ అసలు ధర రూ. 3,639. తాజా ఆఫర్‌తో ఎక్స్‌ట్రీమ్ బాక్స్ యూజర్ బేస్ పెంచుకోవాలని ఎయిర్‌టెల్ యోచిస్తోంది. ఆండ్రాయిడ్ 9పై ఓఎస్‌తో ఈ బాక్స్ పనిచేస్తుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఎక్స్‌ట్రీమ్ బాక్స్ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు నోటిఫికేషన్ పంపిస్తోంది. ఈ ఆఫర్ పొందాలనుకునే వారు మొత్తం రూ.1,951 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ రూ.1,500తోపాటు 129 చానళ్ల నెల వారీ రెంటల్ కూడా ఉంది.

Advertisement

Next Story