ఎయిర్ఇండియా నుంచి ఆ ఉద్యోగులు ఔట్!

by Harish |
Air India
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ విమానయాన రంగ దిగ్గజం ఎయిర్ ఇండియా కొనుగోలుకు అదే సంస్థ ఉద్యోగులు బిడ్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల బృందం అమెరికాకు చెందిన ఇంటరప్స్‌ అనే ఫండ్‌తో కలిసి కన్సార్షియంగా ఏర్పడి ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేశారు. అయితే, ఈ కొనుగోలు రేసులో ఇప్పుడు ఉద్యోగులు లేనట్టేనని తెలుస్తోంది. 219 మంది ఉద్యోగులు, ఫండ్ సంస్థతో కలిసి బిడ్ వేశారు. కానీ, నిబంధనల ప్రకారం..సంస్థను కొనుగోలు చేయడానికి అవసరమైన అర్హతలు బిడ్‌లో లేవని ఎయిర్ ఇండియా తేల్చినట్టు సమాచారం. దీనివల్ల ప్రవేటీకరణ ప్రక్రియలో తర్వాత దశకు ఉద్యోగుల బిడ్‌ను ఎంపిక చేయడంలేదు.

ప్రస్తుతం ఎయిర్ ఇండియా కొనుగోలు అంశంలో టాటా సన్స్, స్పైస్‌జెట్ కంపెనీలు ముందున్నాయి. తర్వాతి ప్రక్రియలో టాటా సన్స్, స్పైస్‌జెట్ సంస్థలు సమగ్రమైన వివరలను ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజన్’ను దాఖలు చేయనున్నాయి. సోమవారం ఎయిర్ ఇండియా ఉద్యోగులకు రాసిన లేఖలో ఎయిర్‌లైన్స్ కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షి మాలిక్ కన్సార్టియంను షార్ట్‌లిస్ట్ చేయలేదని తెలిపారు. ‘ప్రభుత్వ లావాదేవీల సలహాదారుల నుంచి వచ్చిన మెయిల్ ప్రకారం కారణాలను పేర్కొంటూ..విదేశీ కన్సార్టియం సభ్యుల మూడేళ్ల ఆడిట్ వివరాలు లేకపోవడం, ఐబీ ద్వారా వివరాలను సమర్పించకపోవడం. ప్రాథమిక సమాచార మెమోరాండం పరంగా విదేశీ కన్సార్టియం సభ్యుడు తగిన స్థాయిలో విదేశీ పెట్టుబడులను కలిగుండకపోవడం వంటి కారణాలతో రెండో దశ ప్రక్రియకు అనర్హులని తేలినట్టు వివరించారు.

Advertisement

Next Story