మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీకీ కేంద్రం అనుమతి!

by srinivas |
మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీకీ కేంద్రం అనుమతి!
X

దిశ, అమరావతి: మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మా థెరపీకి కేంద్ర అనుమతి ఇచ్చింది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖా కేంద్రానికి రాసిన లేఖలో ఎయిమ్స్‌లో ఇమ్యునో థెరపీ, ఫార్మాథెరపీకి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్యాశాఖ స్పందించింది. మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీకి ఏర్పాట్లు మొదలుపెట్టడానికి సాంకేతిక బృందాన్ని నియమించింది. ఈ ఆదేశాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున వీలైనంత తొందరగా ల్యాబరేటరీ ఏర్పాటు చేయాలని తెలిపింది.

కోవిడ్‌–19 ఓఎస్డీగా జయచంద్రా రెడ్డి కరోనాకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ ప్రత్యేక అధికారి(ఓఎస్‌డీ)గా డాక్టర్ పీఎల్ జయచంద్రా రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆయన తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశాలిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. జయచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్‌గా పదవీ విరమణ చేసి ఉన్నారు.

Tags: Covid-19, Mangalagiri, All India Institute of Medical Sciences, Plasma therapy

Advertisement

Next Story

Most Viewed