- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నమ్మకు కరోనా.. ఐసీయూలో ట్రీట్మెంట్
దిశ,వెబ్‌డెస్క్: సుధీర్ఘకాలం జైలు శిక్షను అనుభవించి త్వరలో విడుదల కానున్న తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ మరికొన్ని రోజుల్లో జైల్లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 27న బెంగళూరులోని పరప్పన అగ్రహాజర జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో జ్వరంతో పాటు వెన్నునొప్పి, శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో శశికళను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలతో పాటు, కరోనా టెస్ట్ లు నిర్వహించారు. ఈ కరోనా టెస్టుల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఆక్సిజన్ పల్స్ రేట్స్ 80కి పడిపోవడంతో వెంటనే ఐసీయూకు తరలించి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
చిన్నమ్మ జైలుకు ఎందుకు వెళ్లింది
తమిళనాడు దివంగత సీఎం జయలలిత తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీ ఆస్తులు కూడబెట్టారని 2016 అభియోగాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలు వెలుగులోకి రావడంతో జయలలితతోపాటు ఆమె నెచ్చెలి శశికళ ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ లను దోషులుగా నిర్ధారిస్తూ సుప్రీం కోర్ట్ నాలుగేళ్లపాటు జైలు శిక్ష, భారీ ఎత్తున జరిమానా విధించింది. జైలు శిక్షతో పాటు విడుదల అనంతరం 6ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని స్పష్టం చేసింది. తాజాగా జైలు శిక్షను పూర్తి చేసుకొని జనవరి 27న విడుదల కానున్న నేపథ్యంలో శశికళ అస్వస్థత గురయ్యారు.దీంతో ఆమెకు కరోనా టెస్ట్ లు చేయగా వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.