Dragon Fruit: ఈ పంటను ఒక్కసారి వేస్తే 20 ఏళ్ల వరకు లక్షల్లో ఆదాయం

by Prasanna |
Dragon Fruit: ఈ పంటను ఒక్కసారి వేస్తే 20 ఏళ్ల వరకు లక్షల్లో ఆదాయం
X

దిశ, వెబ్ డెస్క్ : డ్రాగన్ ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివని వైద్యులు కూడా వెల్లడించారు. కొంతమంది ఎలా పండించాలో తెలియక చాలా కష్టమని అనుకుంటారు. ఒకసారి దీనిని సాగుచేసే విధానం తెలిస్తే ఇంత ఈజీగా పండించవచ్చా అని అనుకోకుండా ఉండరు.

ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేసి కాండం పైకి ఎదిగే విధంగా చేయాలి. అలాగే నీరు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. వీటిలో A1, B2, C3 ఇలా మూడు రకాలు ఉంటాయని రైతులు చెబుతున్నారు.

వీటిని పండించే రైతులు అధిక లాభాలు పొందుతున్నారు. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్స్ కేజీ రూ. 150 నుంచి రూ. 200 పలుకుతుంది. మొదటి క్రాప్ 18 నెలల లోపే వస్తుంది. ఒక ఎకరానికి పది క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుంది. మూడో ఏడాది నాటికీ ఒక ఎకరానికి 13 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడితో పాటు లక్ష రూపాయలు ఆదాయం వస్తుందని తెలిపారు. రైతులు వీటి గురించి తెలుసుకుంటే ఈ పంటను సాగు చేయడం చాలా ఈజీ. ఒకసారి దీనిని సాగు చేస్తే 20 ఏళ్ళ వరకు డ్రాగన్ ఫ్రూట్స్ పంట ఉంటుందని రైతులు తెలిపారు.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story