తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

by Sridhar Babu |
తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
X

దిశ, కరీంనగర్: తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్ది సేపటి కిందట వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం కరీంనగర్‌కు చెందిన మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ శశాంక వెల్లడించారు. ఇండోనేషియా వారితో తిరిగిన వ్యక్తికి గతంలోనే పాజిటివ్ రాగా తాజాగా అతని కుటుంబంలో మరో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్టు వెల్లడించారు. వీరు ఎవరెవరినీ కలిసారు అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు వివరించారు.కరీంనగర్ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. జిల్లా ప్రజలందరూ స్వీయ నిర్భందం నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు.

Tags : corona, 2 cases positive cases, karimnagar, collector shashanka

Advertisement

Next Story