చమురుపై వ్యాట్ భారం!

by Harish |
చమురుపై వ్యాట్ భారం!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విలువ ఆధారిత పన్ను(వ్యాట్) పెంచిన సుమారు యాభై రోజుల తర్వాత మంగళవారం పెట్రోల్ ధరలు రూ. 1.67, డీజిల్ ఏకంగా రూ. 7.10 పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం రూ. లీటర్ పెట్రోల్ రూ. 69.59 నుంచి రూ. 71.26 కి పెరిగింది. ఇక, డీజీల్ ధర ఒక్కసారిగా రూ. 62.29 నుంచి రూ. 69.29కి పెరగడం షాక్ కలిగించే అంశం. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 3.26 పెరిగి రూ. 75.54 ఉండగా, డీజీల్ రూ. 68.22 గా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ పెరిగినందున హర్యానా, కర్ణాటక, అసోం, నాగాలాండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగ్గా, ముంబైలో ధరల మార్పులేదు. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.31 ఉండగా, డీజిల్ రూ. 66.21 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ. 73.30 ఉండగా, డీజిల్ లీటర్ ధర రూ. 65.62.

ఇక, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పేమీలేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.97 ఉండగా, డీజిల్ రూ. 67.82 ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ. 74.61 ఉండగా, డీజిల్ లీటర్ ధర రూ. 68.52 గా ఉంది. విదేశీ మారకపు రేటు కారణంగా ప్రపంచ మార్కెట్లొ ముడిచమురు ధరల ఆధారంతో పెట్రోల్, డీజిల్ ధరల సవరణ జరుగుతూ ఉంటుంది.

Tags : petrol price, diesel price, VAT, delhi

Advertisement

Next Story